ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన ప్రభుత్వం

రాష్ట్రానికి త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

By అంజి  Published on  13 Oct 2024 9:22 AM IST
AP Government, heavy rain, Andhra Pradesh, Home Minister Anita

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రానికి త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లు పటిష్ఠ పర్చాలని అన్నారు.

ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి ఆదేశించారు. పిడుగులు పడి, వాగులు పొంగే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెలకాపరులు, మత్స్యకారులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలన్నీ సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నియంత్రించే చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని హోం మంత్రి అనిత.. అధికారులకు ఆదేశాలిచ్చారు.

Next Story