నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయ‌నుంది.

By -  Medi Samrat
Published on : 29 Jan 2026 4:33 PM IST

నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయ‌నుంది. ఈ పథకం వల్ల నెలకు రూ.85 కోట్ల మేర ప్రభుత్వం భారం ప‌డ‌నుండ‌గా.. మగ్గానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వ‌నుండ‌గా.. 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర‌నుంది. అలాగే.. మర మగ్గానికి 500 యూనిట్లు - 10,534 కుటుంబాలకు లబ్ధి చేకూర‌నుంది. దీంతో మొత్తంగా 1.03,534 కుటుంబాల్లో 4 లక్షల మందికి లబ్ధి క‌ల‌గ‌నుంది. ఈ ప‌థ‌కం ద్వారా చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఆర్థిక ఊరట కలుగుతుంది. మగ్గానికి 200 యూనిట్లకు నెలకు సుమారుగా రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా కానుంది. మర మగ్గం లబ్దిదారులకు నెలకు రూ.1800లు, ఏడాదికి రూ.21,600లు ఆదా ఆవుతుంది.

ఇదిలావుంటే.. 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తుంది ప్ర‌భుత్వం. రాష్ట్రంలో 87,280 మందికి నేతన్నలకు పెన్షన్లు ఇస్తుంది. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్లు పెంచడం వల్ల నేతన్నకు నెలకు రూ.1000 చొప్పున్న ఏడాదికి రూ.12,000 వేలు ఆర్థిక లబ్ధి కలుగుతోంది. అలాగే.. నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా పెంచామ‌ని.. విశాఖలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు, మంగళగిరిలో మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మిస్తున్నామ‌ని వెల్ల‌డించింది.

Next Story