రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంటల్ అలవెన్స్ (HRA) పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022లో పెంచిన ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) 24% ను ఇంకా ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన హెచ్‌ఆర్‌ఏ 01-07-2025 నుండి 30-06-2026 వరకు వర్తిస్తుందని పేర్కొంది. కాగా ఈ హెచ్‌ఆర్‌ఏ సెక్రటేరియట్, డిపార్ట్‌మెంట్ హెడ్స్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాగా గరిష్ఠంగా రూ.25,000 వరకు HRA ఉండనుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 12వ PRC రిపోర్ట్ రాకముందే.. ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.