Andrapradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్త యింది.
By - Knakam Karthik |
Andrapradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్త యింది. నేటి నుంచి కొత్త 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లలో పాలనా వ్యవహారాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్డీవోలు, సిబ్బంది నియామకాలూ షురూ అయ్యాయి. కాగా కాగా కొత్త కలెక్టర్లు, జేసీలను నియమించే వరకు ఉమ్మడి జిల్లాల అధికారులే ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
2 కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్‌ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు. ప్రజలకు వేగంగా పాలన అందించడం, సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లనూ ఏర్పాటు చేసింది.
పలు మండలాల సరిహద్దులనూ మార్చింది. ప్రజల కోరిక మేరకు సమీప జిల్లాల్లో కలిపింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లుగా అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.