శ్రీవారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుని వెళ్లలేకపోతున్నారా.. ఈ విషయం గుర్తుంచుకోండి..!

Good News For Tirumala Devotees. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకుని కరోనా కారణంగా రాలేకపోయిన భక్తులు 90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని

By Medi Samrat  Published on  19 April 2021 10:30 AM IST
Tirumala

తిరుమల శ్రీవారి దర్శనం కోసం హిందూ బంధువులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ తేదీలలో వెళ్లాలని అనుకుని కొందరు ఆన్ లైన్ లో టికెట్లను కూడా బుక్ చేసుకుని ఉంటారు. కానీ కొన్ని కారణాల వలన దర్శనానికి వెళ్లలేకపోతూ ఉంటారు కొందరు. అలాంటి వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకుని కరోనా కారణంగా రాలేకపోయిన భక్తులు 90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ తెలిపింది.

దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. కరోనా పెరుగుతూ ఉండడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తగ్గించాలని టీటీడీ యోచిస్తోంది. మే నెలకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీడీపీ తెలిపింది.అయితే, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో టికెట్ల కోటాను రోజుకు 25 వేల నుంచి 15 వేలకు తగ్గించినట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతోంది. ఆదివారం 27,822 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 7లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 12,062 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ తెలిపింది.


Next Story