రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అసెంబ్లీ లో మర్యాదపూర్వకంగా కలిశారు.శ ్రీనివాసపురం మండిపల్లి నాగిరెడ్డి హంద్రీ–నీవా (HNSS) మెయిన్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి మంత్రి వినతి పత్రం అందజేశారు.
25 వేల ఎకరాలకు సాగునీటి లాభం
ఈ ఆయకట్టు నిర్మాణం పూర్తయితే రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లి మండలాల్లోని 25 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాల నిల్వలు పెరుగుతాయని మంత్రి వివరించారు.
త్వరలో ప్రారంభం కానున్న రూ.450 కోట్ల నిర్మాణ పనులు హంద్రీ–నీవా మెయిన్ కెనాల్ ఫేజ్-1లో భాగంగా రూ.450 కోట్ల నిర్మాణ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రిని మంత్రి కోరారు.
సీఎం హామీ
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హంద్రీ–నీవా మెయిన్ కెనాల్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రికి హామీ ఇచ్చారు.