తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
Good news for Telugu people.. Special trains for Dussehra festival. దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్,
By అంజి Published on 25 Sept 2022 11:00 AM ISTదసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్, హైదరాబాద్ - యశ్వంతపూర్, యశ్వంతపూర్ - హైదరాబాద్, నాందేడ్ - పూరి, పూరి - నాందేడ్ మధ్య వరుసగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. సికింద్రాబాద్-తిరుపతి (రైలు నెం.07469) సెప్టెంబర్ 25న సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-సికింద్రాబాద్ (రైలు నెం. 07469) 26వ తేదీ రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్‌లలో ఆగుతుంది. హైదరాబాద్ - యశ్వంత్‌పూర్ (ట్రైన్ నెం. 07233) ప్రత్యేక రైలు 25, 27 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్ - హైదరాబాద్ (ట్రైన్ నెం. 07234) స్పెషల్ సోమ, బుధవారాల్లో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 03.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, యహలంక స్టేషన్లలో రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
మరోవైపు నాందేడ్ - పూరి (07565) రైలు 26వ తేదీ మధ్యాహ్నం 3.25 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 05.30 గంటలకు పూరీకి చేరుకుంటుంది. పూరీ - నాందేడ్ రైలు సెప్టెంబరు 27న రాత్రి 10.45 గంటలకు పూరిలో బయలుదేరి రెండవ రోజు తెల్లవారుజామున 1 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైలు ముఖ్‌దేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, స్టేషన్లలో ఆగుతుంది.