ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పని చేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు 2026 మార్చి 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవాకాలం ముగిసింది. దీంతో ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే సేవల పొడిగింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియమాకానికి ఆర్థికశాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.