ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తోంది. పేదలు, ఇప్పటికీ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పించబోతోంది. పట్టణ ప్రాంత అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై 75.1 శాతం సంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రజల స్పందనను ఆర్టీజీఎస్ ద్వారా తెలుసుకుంటున్నట్లు వెల్లడించింది.
పట్టణ ప్రాంతాల్లో నివసించేవారికి 2 సెంట్ల భూమి, గ్రామాల్లో నివసించే వారికి 3 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. అర్హులైన వారికి మహిళ పేరుతో ఈ భూమిని కేటాయిస్తారు. ఇకపోతే ఇంటి స్థలం లేదా ఇల్లు పొందినవారికి 10 ఏళ్ల తర్వాత ఆ ఇంటిపై పూర్తి హక్కులు లభిస్తాయి. జీవితంలో ఒకసారి మాత్రమే హౌస్ సైట్ లభిస్తుంది.