రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By -  Medi Samrat
Published on : 23 Jan 2026 10:00 AM IST

రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ రోజు రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఇ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు.

రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇ-లాటరీ నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరగనుంది.

Next Story