అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను త్వరగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నియామక ప్రక్రియపై కోర్టుల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు.
గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆ తర్వాత పీఎంటీ, పీఈటీ పరీక్షలు జరగాలి.. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం.. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియన పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశ ఉంది.