లిక్కర్ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : గోనె ప్రకాష్ రావు
దేశంలో సూట్ కేస్ కంపెనీలు పెట్టి దోచుకున్న ముఖ్యమంత్రులు వారి తనయులు చాలా మంది కటకటాలు లెక్కపెట్టారు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి వందల కోట్లు డబ్బులు దోచుకున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఆ కేసుతో పాటు, లిక్కర్ కేసులో జైలు వెళ్లడం ఖాయం.
By Medi Samrat
దేశంలో సూట్ కేస్ కంపెనీలు పెట్టి దోచుకున్న ముఖ్యమంత్రులు వారి తనయులు చాలా మంది కటకటాలు లెక్కపెట్టారు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి వందల కోట్లు డబ్బులు దోచుకున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఆ కేసుతో పాటు, లిక్కర్ కేసులో జైలు వెళ్లడం ఖాయం. తాడేపల్లి ప్యాలెస్ లో తనిఖీలు నిర్వహిస్తే కొన్ని వందల కోట్లు విలువ చేసే బంగారం, డబ్బులు దొరుకుతాయి. తనిఖీలు చేపట్టాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు విజ్ఞప్తి చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ ఎమ్మెల్యే వై.ఎస్.జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, వైసిసి నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందుల ఎన్నికలను కూటమి గెలచుకుంది.. వైసీపీ పులివెందులలో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఏది ఏమైనా జగన్ అండ్ కో చెప్తున్నట్టు ఈ ఎలెక్షన్ ను రద్దు చేసే అవకాశం లేదన్నారు.
జగన్ మోహన్ రెడ్డి భయస్తుడు.. సీబీఐ కు భయపడి తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ ను నమ్ముకొని లిక్కర్ స్కామ్ లో చాలా మంది జైలు పాలయ్యారు. జగన్ వైసిపి నాయకులను జైలు వెళ్లి పరామర్శిస్తున్నట్లు , లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అధికారులను ఎందుకు జైలు కు వెళ్లి కలవటం లేదో సమాధానం చెప్పాలన్నారు. లిక్కర్ స్కామ్ లో ఇంకా అరెస్ట్ లు జరుగుతాయి.. చివరకు లిక్కర్ కేసులో జగన్ జైల్ కు వెళ్లడం ఖాయమని తెల్చి చెప్పారు.
పులివెందుల, ఒంటిమిట్ట లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జగన్ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లులో ఎలాంటి పరిస్థితి ఉండేదో అందరికీ తెలుసునన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని యూనానిమస్ అవ్వలేదా అంటూ వైసిపి నాయకులను ప్రశ్నించారు. గత 30 ఏళ్లలో పులివెందుల్లో ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. ఈసారి జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 11 మంది నామినేషన్లు వేయటం జరిగిందన్నారు.
ప్రతిపక్ష పార్టీ హోదా దక్కని వైసీపీ ఎమ్మెల్యే జగన్ జరిగిన ఎన్నికలపై అవాకులు చవాకులు మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వుందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల కారణమన్నారు. వారి వల్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని, జగన్ వారిని కూడా మోసం చేయటం తో వారు ఈసారి సాయం చేయలేదన్నారు. పరదాలు కట్టుకొని తిరిగిన జగన్ కి బుద్ది చెప్పే విధంగా వైసీపీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారన్నారు.
జగన్ చంద్రబాబుకు ఇదే ఆఖరి ఎలక్షన్ అంటున్నాడు.. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ వుండదా అంటూ ప్రశ్నించారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడలేదా అంటూ అడిగారు. ఒకరి కోసం పార్టీలు ఎప్పుడు ఆగిపోవనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు. గతంలో నంద్యాల ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలి అని జగన్ మాట్లాడడం సరైనదా? అంటూ ప్రశ్నించటం తోపాటు , చంద్రబాబు నరకానికి పోతాడని జగన్ లా శాపాలు పెట్టే నాయకుడ్ని భారతీయ రాజకీయ చరిత్రలో తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలాంటి రాజకీయ చరిత్ర ఉన్న వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడం విడ్డూరంగా వుందన్నారు..