అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలకు నెల రోజుల గడువు ఉండనుంది. కాగా ఈ నివేదికకు మంత్రులు ఆన్‌లైన్‌లో ఆమోదం తెలపనున్నారు. ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు విలీనం కానుండగా.. తూర్పు గోదావరి జిల్లాలోకి మండపేట నియోజకవర్గం, వాసవి పెనుగొండ మండలంగా పెనుగొండ మారనుంది. మరో కొత్త మండలంగా ఆదోని మండలంలోని పెద్దహరివాణం ఏర్పడనుంది.