నెల్లూరు జిల్లాలో విషాదం.. ఉదయం లేచి గ్యాస్ వెలిగించగానే..

Gas Leak In Nellore District. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని

By Medi Samrat  Published on  22 Nov 2021 11:53 AM IST
నెల్లూరు జిల్లాలో విషాదం.. ఉదయం లేచి గ్యాస్ వెలిగించగానే..

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృతి చెందగా కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అబ్బాస్ కుటుంబం స్థానికంగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే లీక్ అవడంతో పేలుడు జరిగి మంటలు వ్యాపించాయి.

తెల్లవారు జామున కేకలు వినిపించడంతో స్థానికులు పరుగులు తీస్తూ అబ్బాస్ ఇంటివైపు వచ్చారు. అయితే అప్పటికే అబ్బాస్, సౌషాద్ మంటల్లో కాలి మృతి చెందారు. వారి కుమార్తె అయేషాకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. టిఫిన్ సెంటర్ కోసం ఉదయమే లేచిన భార్య సాంబారు కోసం గ్యాస్ వెలిగించగా ఈ ప్రమాదం జరిగింది. వారు ఉంటున్నది చిన్న గది కావడంతో ప్రమాదం తీవ్రత పెరిగి, దంపతులు అక్కడికక్కడే చనిపోవడంతో పాటూ వారి కుమార్తెకూ మంటలు అంటుకున్నాయని పోలీసులు చెప్పారు.


Next Story