అదంతా దుష్ప్రచారమే : గరికపాటి టీమ్

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై ఇటీవల సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారని ఆయన టీమ్ తెలిపింది.

By Medi Samrat  Published on  7 Jan 2025 5:28 PM IST
అదంతా దుష్ప్రచారమే : గరికపాటి టీమ్

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై ఇటీవల సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారని ఆయన టీమ్ తెలిపింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొందరు వ్యక్తులు గరికపాటి నరసింహారావుపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉండడంపై ఆయన టీమ్ స్పందించింది. గరికపాటిపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ఆయన క్షమాపణలు చెప్పినట్టు, ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. గరికపాటి నరసింహారావు పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపింది.

గరికపాటిపై కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో పరువు తీస్తున్నారని, గరికపాటిపై వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్యదూరమని పోస్టులో తెలిపారు. వీటన్నింటినీ తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్‌ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్‌, పరువు నష్టం కేసులు వేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులను బాధపెడుతోందని గరికపాటి సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

Next Story