ఏపీలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన సాగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

By అంజి  Published on  4 Aug 2024 7:45 PM IST
Gang rule, government, APnews, YS Jagan

ఏపీలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన: వైఎస్ జగన్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన సాగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని అన్నారు. వైసీపీ నేతలను కావాలనే టార్గెట్ చేస్తూ ఉన్నారని.. హత్యా రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారని ఆరోపించారు.

"ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే. ప్రజలకిచ్చిన హామీలను @ncbn నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, @YSRCParty నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం." అంటూ ట్వీట్ చేశారు.

Next Story