కేబుల్ నెట్‌వర్క్‌లో 'గేమ్ ఛేంజర్'.. యజమాని అరెస్ట్
రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గేమ్ ఛేంజర్ మూవీ విడుదలై వారం రోజులు కాకముందే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ లోకల్ ఛానల్‌లో పైరస్ కాపీని ప్రసారం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
By Knakam Karthik Published on 17 Jan 2025 11:19 AM ISTకేబుల్ నెట్‌వర్క్‌లో 'గేమ్ ఛేంజర్'.. యజమాని అరెస్ట్
కొత్త సినిమాలు రిలీజ్ కావడమే ఆలస్యం, డైరెక్ట్‌గా మొబైల్ ఫోన్లలోనే చక్కర్లు కొడుతున్నాయి. పైరసీకి అడ్డుకట్ట వేయాలని టాలీవుడ్ ఇండస్ట్రీ చర్యలు తీసుకుంటున్నా పైరసీ మాత్రం ఆగడం లేదు. రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గేమ్ ఛేంజర్ మూవీ విడుదలై వారం రోజులు కాకముందే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ లోకల్ ఛానల్‌లో పైరస్ కాపీని ప్రసారం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మూవీ టీమ్ ఇటీవలే సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్‌పై సోదాలు జరిపి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ తమ ప్రాంతంలోని లోకల్ ఛానల్‌లో టెలికాస్ట్ చేస్తున్నారని తెలుపుతూ ఇటీవల ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా నెట్టింట షేర్ చేశాడు. దీనిపై రెస్పాండ్ అయిన పలువురు సినీ ప్రముఖులు, మూవీ లవర్స్ ఫైర్ అయ్యారు. సినిమా చిత్రీకరణ వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉందని, పైరసీ కాపీని ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ రూపుదిద్దుకుంది. కియాడా అడ్వాణీ హీరోయిన్‌గా నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజైంది. తాము డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకుంటే గేమ్ ఛేంజర్ సినిమాను లీక్ చేస్తామంటూ బెదిరించిన వారిపై మూవీ టీమ్ ఇప్పటికే సైబర్ క్రైమ్‌లో కంప్లయింట్ చేసింది. మూవీ రిలీజ్‌కు ముందు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, రిలీజ్ అయిన వెంటనే ఆన్‌లైన్‌లో లీక్ చేశారని టీమ్ కంప్లయింట్ పేర్కొంది. ఆధారాలు సేకరించిన మూవీ టీమ్.. సినిమాను ప్రదర్శించిన ముఠాపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా గేమ్ ఛేంజర్ సినిమా పైరసీని కేబుల్ టీవీలో ప్రదర్శించిన యజమానిని పోలీసులు గాజువాక పొలీసులు అరెస్ట్ చేశారు. అప్పలరాజుకు చెందిన ఏపీ లోకల్ టీవీ ఆఫీసులో సోదాలు చేశారు. పైరసీ చేస్తున్నట్లు గుర్తించి పరికరాలు సీజ్ చేశారు.