తలసేమియా బాధితులకు ఫ్రీ ప‌రీక్ష‌లు

తలసేమియాతో భాధపడుతున్న చాలామంది బాధితులకు శాశ్వత పరిష్కారం బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్.. అటువంటి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ కొరకు ఈ హెచ్.ఎల్.ఏ పరీక్షలు తప్పనిసరి.

By Medi Samrat
Published on : 27 July 2024 5:58 PM IST

తలసేమియా బాధితులకు ఫ్రీ ప‌రీక్ష‌లు

తలసేమియాతో భాధపడుతున్న చాలామంది బాధితులకు శాశ్వత పరిష్కారం బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్.. అటువంటి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ కొరకు ఈ హెచ్.ఎల్.ఏ పరీక్షలు తప్పనిసరి. ఇటువంటి హెచ్ఎల్ఏ పరీక్షలును భీమవరంలో మొట్టమొదటిసారిగా ఈరోజు టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ A.S.N.Raju Plaza నందు A.S.N. రాజు ఛారిటబుల్ ట్రస్ట్, ధాత్రి ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లల కోసం ఉచిత హెచ్.ఎల్.ఏ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

తలసేమియా తో బాధపడుతున్న 30 మంది పిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10,000/- రూపాయలు విలువ గల హెచ్.ఎల్.ఏ పరీక్షలు ఈ శిబిరం నందు ఉచితంగా నిర్వహించడం జరిగింది. అలాగే తలసేమియా పిల్లలకు అవసరమగు రక్త పరీక్షలను SLD స్పెషాలిటీ ల్యాబ్స్ ద్వారా ఉచితంగా నిర్వహించడం జరిగింది.

తలసేమియాను శాశ్వతంగా నిర్మూలించడమే ధ్యేయంగా" కృషి చేయడం జరుగుతుందని.. అలాగే A.S.N.Raju Charitable Trust తలసేమియా పిల్లల కొరకు భవిష్యత్తులో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అల్లూరి సూర్యనారాయణ రాజు తెలపడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమగోదావరి జిల్లా అడిషనల్ డిఎం & హెచ్ ఓ dr.B. భాను నాయక్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి.రామకృష్ణంరాజు పాల్గొన్నారు. A.S.N.Raju బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గాప్రసాద్, ధాత్రి ఫౌండేషన్ సమన్వయకర్త రవీంద్రనాథ్, సప్త ఫౌండేషన్ వ్యవస్థాపకులు శరత్ బాబు, A.S.N. రాజు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు చందన, హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story