గుడ్‌న్యూస్..ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ నేడే ప్రారంభం
ఇవాళ్టి నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ప్రారంభించనుంది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్..ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ నేడే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 కోసం ప్రిపేర్ అవుతోన్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇవాళ్టి నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ప్రారంభించనుంది. రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చేతుల మీదుగా ఉచిత్ ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభంకానుంది. ఆన్‌లైన్ ఉచిత కోచింగ్‌తో బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా 24 గంటలూ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా యాప్ రూపకల్పన చేశారు.
కాగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లు, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మోడల్ స్కూళ్లు, సంక్షేమ సొసైటీల్లో పోస్టులకు మరొక నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు మే 15వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన సిలబ్‌సను కూడా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించే పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ విధానంలో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు.