నేతన్నలకు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

By -  Medi Samrat
Published on : 26 Feb 2026 3:22 PM IST

నేతన్నలకు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు చేనేత ఉత్పత్తుల విక్రయాలు పెంచేలా ఎగ్జిబిషన్లు, స్టాళ్లు ఏర్పాటు చేస్తోందన్నారు.ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను మంత్రి కొలుసు పార్థసారథి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల నుంచి వచ్చిన చేనేత ఉత్పత్తులను, వాటి నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పందనతో అమ్మకాల గురించి ఆరా తీశారు.

నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయబోతున్నామన్నారు. చేనేత సహకార సంఘాలకు విడతలవారీగా బకాయిలు సైతం విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారని మంత్ర కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు.

Next Story