ఆరు రోజుల క్రితం స‌ముద్రంలో గ‌ల్లంతైన మత్స్యకారులు సేఫ్

Four missing fishermen are safe in krishna district. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని అంతర్వేది సముద్ర తీరంలో ఆరు రోజుల క్రితం నలుగురు మత్స్యకారులు గల్లంతైన

By అంజి  Published on  7 July 2022 5:31 PM IST
ఆరు రోజుల క్రితం స‌ముద్రంలో గ‌ల్లంతైన మత్స్యకారులు సేఫ్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని అంతర్వేది సముద్ర తీరంలో ఆరు రోజుల క్రితం నలుగురు మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిందే. వారి కోసం అధికారులు, పోలీసులు ఎంతగానో గాలించారు. తాజాగా గల్లంతైన వారి ఆచూకీ లభించింది. గల్లంతై నలుగురు మత్స్యకారులు అమలాపురం సమీపంలోని కొత్తపాలెం దగ్గర సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత స్థానికుల ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

6 రోజుల క్రితం క్యాంబెల్‌పేటకు చెందిన జాలర్లు రామాని నాంచార్లు, చెక్క నరసింహారావు, విశ్వనాథపల్లి చినమస్తాన్, మోకా వెంకటేశ్వరరావు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అప్పటి నుంచి వీరి గురించి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మొన్న రాత్రి పోలీసులు ఐఎంఈఐకి ఐటీ కోర్ నుంచి బ్లాంక్ మెసేజ్ పంపారు. రాత్రి పదకొండు గంటలకు మెసేజ్ డెలివరీ అయినట్టు సమాచారం వచ్చింది. ఆ మెసేజ్ కూడా డెలివరీ కావడంతో వారి ఆచూకీపై ఆశలు చిగురించాయి. మత్స్యకారుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరకు గల్లంతైన మత్స్యకారులు ఇవాళ మధ్యాహ్నం 1 గంటల సమయంలో కొత్తపాలెం దగ్గర ఒడ్డుకు చేరుకున్నారని కృష్ణా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులను వారి స్వగ్రామానికి తీసుకువస్తామని తెలిపారు.

Next Story