అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మణం చెందారు. మరో ఇద్దికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీరంతా అనంతపురం రాణి నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో పెళ్లి బట్టలు కొనుగోలు చేసి అనంతపురం తిరిగి వస్తుంటే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. హర్యానాలో 60 మంది భక్తులతో తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. కుండ్లీ - మనేసర్ - పల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. ప్రయాణకులందరూ చండీగఢ్, పంజాబ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మథురలోని బృందావన్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.