తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. రాజానగరం దివాన్ చెరువు నుంచి గామన్ బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. లారీ టైరు పేలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.