కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన కేసులో సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుధాకర్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బాలికపై సుధాకర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కొద్ది రోజుల కిందట వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండటంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి కర్నూలు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య ఇంట్లో లేనప్పుడు సుధాకర్ తనను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని, అశ్లీల చిత్రాలు చూపించేవారని వాపోయింది. సుధాకర్ అసలు రూపాన్ని బయటపెట్టాలన్న ఉద్దేశంతో ఓరోజు ఫోన్లో ఆ వేధింపులను సీక్రెట్‌గా రికార్డు చేసినట్లు బాధితురాలు తెలిపింది. మొన్నటి వరకు ఆయన ఎమ్మెల్యే ఉండటంతో ధైర్యం చేసి ఎవరికీ చెప్పలేకపోయానని తెలిపింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసిన సుధాకర్‌ను అరెస్ట్ చేశారు.