Video : పిఠాపురంలో ఇసుక దందా.. బయటకొచ్చిన వర్మ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతున్న ఇసుక దందా వార్తల్లో నిలిచింది.

By Medi Samrat
Published on : 7 Jun 2025 7:02 PM IST

Video : పిఠాపురంలో ఇసుక దందా.. బయటకొచ్చిన వర్మ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతున్న ఇసుక దందా వార్తల్లో నిలిచింది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శలు గుప్పించారు. రోజూ 200-300 లారీలతో ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుని మోసాలకు దిగుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

పోలీసులు తీరు మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారని అయినా కూడా కొందరిలో మార్పు రాలేదని వర్మ విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నారని, వారిపై కేసులు పెట్టాల్సిందేనని వర్మ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కాబట్టి తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు.

Next Story