మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో జరుగుతూ ఉంది. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై తాజాగా సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. సునీత తరపు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదనలు కొనసాగించారు. వివేకా హత్య కేసులో కుట్ర కోణం ఉందని కోర్టుకు వివరించారు. సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు జరపలేదని గుర్తు చేశారు. CBI ఒకదశ వరకు విచారణ జరిపి వదిలేసిందన్నారు. కేసులో లోతైన దర్యాప్తు అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపకపోతే అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉందని, వివేకా కేసులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.