జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిస్తున్నారు: కొడాలి నాని

Former minister Kodali Nani made key comments on Jr. NTR. జూనియర్ ఎన్టీఆర్‌ విషయంపై మాజీమంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  29 May 2023 4:00 PM IST
జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిస్తున్నారు: కొడాలి నాని

జూనియర్ ఎన్టీఆర్‌ విషయంపై మాజీమంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని.. అందుకే టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేయవవద్దని నిర్మాతలను బెదిరించారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌ హాజరుకాలేకపోవడంతో ఆయన తల్లిని ఇష్టం వచ్చిన తిట్టిపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భార్య, కోడలు మాత్రమే ఆడవాళ్లా?.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఆడవాళ్లు కాదా? అని మాజీమంత్రి కొడాలి నాని నిలదీశారు.

చంద్రబాబును పొగిడించడానికే మహానాడు పెట్టారని.. మహానాడు వేదిక మీద బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్‌ బొమ్మ ఎలా పెడతారని అన్నారు. ఎన్‌టీఆర్‌ పేరుతో 4 ఓట్లు సంపాదించుకోవడం కోసమే ఈ తపనంతా అని అన్నారు. చంద్రబాబు వెంట ఉన్నది.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, పవన్‌ కల్యాణ్‌ మాత్రమేనని అన్నారు. వీళ్లెవరూ బీసీలు కాదు.. అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజికవర్గానికే మంత్రి పదవులు ఇస్తారని అన్నారు. చంద్రబాబును ‘ఆల్‌ఫ్రీ బాబు’ అని వైఎస్సార్‌ ఆనాడే చెప్పారని.. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్‌ ఆనాడే అన్నారని విమర్శలు గుప్పించారు కొడాలి నాని.


Next Story