సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్ర విమర్శలు

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

By Medi Samrat  Published on  6 July 2024 2:45 PM GMT
సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్ర విమర్శలు

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి అక్రమాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం విచారణ జరపాలని సవాల్ విసిరారు. పొదలకూరులోని లేఔట్ వారితో నెల రోజులుగా సోమిరెడ్డి లావాదేవీలు జరుపుతున్నారని, చర్చలు సఫలం కాకపోవడంతో నుడా అధికారులతో పోలీసులకు ఫిర్యాదు చేయించారన్నారు. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తామని, దమ్ముంటే విచారణ జరపాలని ఛాలెంజ్ చేశారు. సోమిరెడ్డి ఇంటి చుట్టూ ఉన్న లేఔట్లలో కమిషన్లు తీసుకున్నాడని.. మీ పాపానికి, అధికార దాహానికి పంచాయతీ కార్యదర్శులపై చర్యలకు నివేదిక ఇచ్చారన్నారు. మేము అప్పట్లో అధికారులకి అండగా నిలిచామని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లేఔట్లు వేశారని, సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని కాకాణి ఆరోపించారు. అక్రమ లేఔట్లపై అప్పట్లోనే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని, 40 లేఔట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ అధికారులు విచారణ చేసి రూ. 6.5 కోట్లు జరిమానా విధించారని, అయితే, సోమిరెడ్డి జోక్యం చేసుకుని జరిమానా కట్టకుండా చేశారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లో సోమిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారన్నారు.

Next Story