పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ కొన్ని ఏరియాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించనున్నారు. దీంతో సినిమా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి నెలకొంది.
అయితే పవన్ మూవీ రిలీజ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కల్యాణ్‌పై రాజకీయంగా నిత్యం విమర్శలు గుప్పించే మాజీ మంత్రి..ఇప్పుడు ఎక్స్‌లో చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. అంబటి రాంబాబు ఇలా రాసుకొచ్చారు.. "పవన్ కల్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను!" అని ఆయన ట్వీట్ చేశారు.