శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

Flood flow to Srisailam continues to increase amid heavy rains. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది.

By Medi Samrat  Published on  15 Aug 2022 5:05 PM IST
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో శ్రీశైలం డ్యాం 10 గేట్లను ఎత్తి 15 అడుగుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 4,16,384 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 4,39,596 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించేందుకు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.


Next Story