ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌ డెడ్‌

ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు-కర్నూలు రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది.

By అంజి
Published on : 3 Sept 2023 10:26 AM IST

Bapatla, Road Accident , APnews

ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌ డెడ్‌

ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న గుంటూరు-కర్నూలు రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులను నరసరావుపేట ఆర్కెస్ట్రా గ్రూప్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినుకొండ నుండి నరసరావుపేట వెళ్తుండగా ఈ దర్ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే.. అనంతపురం జిల్లాలో రెండు బైక్‌లు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు. విడపనకల్లు మండలం పొలికి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులను బాలు (18), వర్ధన్‌ (20)లుగా గుర్తించారు.

Next Story