Machilipatnam: మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప.. బరువు ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులు ఆదివారం రాష్ట్ర తీరంలోని సముద్రంలో సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నారు.

By అంజి  Published on  29 July 2024 10:27 AM IST
Fishermen, giant fish , Krishna District, Andhra Pradesh

Machilipatnam: మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప.. బరువు ఎంతో తెలుసా?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులు ఆదివారం రాష్ట్ర తీరంలోని సముద్రంలో సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నారు. మూడు రోజుల క్రితం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు కృష్ణాలోని మచిలీపట్నంలోని గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు భారీ చేప చిక్కింది. జాలర్లు టేకు చేప అని పిలిచే భారీ చేపతో తిరిగి సముద్రం ఒడ్డుకు వచ్చారు. వారి వలలో పెద్ద చేప కనిపించడంతో ఆశ్చర్యపోయిన మత్స్యకారులు దానిని బయటకు తీసుకురావడానికి ఇతరుల సహాయం కోరారు.

దాన్ని బయటకు తీయడానికి క్రేన్‌ను పిలిపించారు. చేపను దగ్గరుండి చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సుకతతో గ్రామస్థులు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీయడం కనిపించింది. చెన్నైకి చెందిన వ్యాపారులు మత్స్యకారుల నుంచి చేపను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2020లో దాదాపు మూడు టన్నుల బరువున్న ఒక పెద్ద స్టింగ్రే చేపను ఇదే జిల్లాలో మత్స్యకారులు పట్టుకున్నారు. ఈ తరహా సొర చేపలు తీరానికి చేరువగా రావడం చాలా అరుదు. ఒక్కోసారి ఇతర చేపలను వేటాడుతూ ఇవి తీరాలకు దగ్గరగా వస్తుంటాయి. అలాంటి సమయాల్లోనే మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి.

Next Story