Video: విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం..తప్పిన ప్రాణనష్టం

విశాఖలో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది.

By Knakam Karthik
Published on : 29 Aug 2025 1:21 PM IST

Andrapradesh, Visakhapatnam, Fire breaks out in bus, passengers

Video: విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం..తప్పిన ప్రాణనష్టం

విశాఖలో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్యాసింజర్లతో కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తుండగా నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని శాంతిపురం వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ముందుగా పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులందరినీ దించేశారు. అయితే వెంటనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. మరోవైపు పెట్రోల్ బంక్ పక్కనే ఉండటంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది.

అయితే ప్రమాదం సమయంలో బస్సులో 130 మంది ఉన్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు. వెనుక నుంచి వచ్చే ఆటో వాళ్లు, ఇతర వాహనదారులు పొగలు వస్తున్నాయి అని చెప్పారని అన్నారు. దీంతో వెంటనే సిగ్నల్ దగ్గరలో బస్సును ఆపేసి, ప్రయాణికులను దించేసినట్లు చెప్పారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదమూ జరగలేదని పేర్కొన్నారు.

Next Story