నెల్లూరు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో అగ్నిప్రమాదం

Fire Accident in Nellore Collectorate Office.నెల్లూరు జిల్లాలోని క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2023 1:24 PM IST
నెల్లూరు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో అగ్నిప్రమాదం

నెల్లూరు జిల్లాలోని క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో శ‌నివారం అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో భ‌ద్ర‌ప‌రిచిన పాత ఎన్నిక‌ల సామాగ్రి ద‌గ్ఘ‌మైంది.

క‌లెక్ట‌రేట్ వెనుక ఉన్న స్టోర్ రూమ్‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నాం ఒక్క‌సారిగా మంట‌లు చేల‌రేగాయి. ద‌ట్ట‌మైన పొగ‌లు క‌నిపించ‌డంతో క‌లెక్ట‌రేట్ సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఈ ప్ర‌మాదంలో భ‌ద్ర‌ప‌రిచిన ఎన్నిక‌ల సామాగ్రి పూర్తిగా ద‌గ్థ‌మైంది. రెండో శ‌నివారం సెల‌వు కావ‌డంతో సిబ్బంది ఎవ‌రూ విధుల్లో లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింద‌ని అంటున్నారు.


అస‌లు మంట‌లు ఎలా అంటున్నాయ‌నేది తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని బావిస్తున్నారు.

Next Story