శ్రీవారి ఆల‌యం పోటులో స్వ‌ల్ప అగ్నిప్ర‌మాదం

Fire accident at srivari temple.తిరుమల శ్రీవారి ఆలయం పోటులో గురువారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 1 April 2021 1:17 PM IST

fire accident at tirumala temple

తిరుమల శ్రీవారి ఆలయం పోటులో గురువారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోనె సంచుల‌కు మంట‌లు అంటుకోవ‌డంతో ప్ర‌మాదం చోటు చేసుకుంది. నెయ్యి అంటుకున్న గోనె సంచులు కావ‌డంతో ద‌ట్ట‌మైన పొగ‌లు వ్యాపించాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది మంట‌ల‌ను ఆర్పివేశారు. పెను ప్ర‌మాదం త‌ప్ప‌డంతో అధికారుల‌తో పాటు అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.




Next Story