చంద్రబాబు అరెస్ట్.. ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు.
By అంజి Published on 13 Sep 2023 8:00 AM GMTచంద్రబాబు అరెస్ట్.. ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు.. చాలా దురదృష్ణకరమైన రోజు అని అన్నారు. దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు. అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. దీనికి పరిష్కారం త్వరలోనే రాబోతంది. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుందని జోస్యం చెప్పారు. అలాంటి లెజెండరీ చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేసి బీభత్సం సృష్టించిన వారికి పుట్టగతులు ఉండవని అశ్వనీదత్ ఫైర్ అయ్యారు. వారికి శిక్ష తప్పదని అన్నారు.
చంద్రబాబు అరెస్టును ఖండించిన అశ్వినీ దత్దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుది. అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుంది. తర్వాత చంద్రబాబు అక్రమ అరెస్టుకు… pic.twitter.com/RrOqJyurUP
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2023
అంతకుముందు 'ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి' అంటూ ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. సెప్టెంబర్ 18వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అలాగే సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై ఈ నెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది.