నేను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా: నటుడు సుమన్

పొలిటికల్‌ ఎంట్రీపై ప్రముఖ సినీ నటుడు సుమన్‌ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.

By అంజి  Published on  11 May 2023 3:45 AM GMT
Film actor Suman,  political debut, APnews, Tollywood

నేను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా: నటుడు సుమన్

పొలిటికల్‌ ఎంట్రీపై ప్రముఖ సినీ నటుడు సుమన్‌ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు. వెస్ట్‌ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో నిన్న జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి సుమన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశంపై స్పందించారు. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. తెలంగాణలో తన పూర్తి మద్ధతు భారత రాష్ట్ర సమితికే ఉంటుందని తేల్చి చెప్పారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు.

రైతులు కోరేది కొంచేమేనని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని సుమన్‌ అన్నారు. వర్షాలు విపత్తులు ప్రతి ఏడాది వస్తుంటాయని, కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన కామెంట్స్‌ని సుమన్‌ సమర్థించారు. రజనీకాంత్‌ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చేసిన సుమన్‌ ఇటీవల కాలంలో సినిమాల్లో నటించడం తగ్గించారు. ఆడపా దడపా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.

Next Story