వచ్చే ఏడాది టీచర్‌ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు

దేశంలో ఎక్కువ పింఛన్‌ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తాము ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడం లేదన్నారు.

By అంజి  Published on  11 Dec 2024 8:01 AM GMT
teacher posts, CM Chandrababu, APnews, Collectors Conference

వచ్చే ఏడాది టీచర్‌ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు

దేశంలో ఎక్కువ పింఛన్‌ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తాము ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడం లేదన్నారు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. సంక్రాంతి నాటికి ఆర్‌ అండ్‌ బీ రోడ్లపై గుంతలు ఉండకూడదని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు. మంత్రి నారా లోకేష్‌ కృషి వల్లే విశాఖకు గూగుల్‌ వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్‌తో ఎంవోయూ వల్ల వైజాగ్‌లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. 'ప్రతి ఒక్కరూ హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్‌ వర్క్‌ నేర్చుకోవాలి. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయి. సంక్షోభంలోనూ అవకాశాలు సృష్టించుకోవాలి' అని పేర్కొన్నారు. గతంలో నెలలో మొదటి తేదీన జీతాలు ఇవ్వని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పెన్షనర్లకూ మొదటి తేదీనే పెన్షన్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాల్సిందే అని, ఆ విషయంలో కలెక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పాలనలో వేగం పెరిగితేనే ప్రజలకు వేగంగా సేవలు అందుతాయన్నారు. అప్పుడే పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొన్నారు.

Next Story