'త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ'.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
టీడీపీకి కార్యకర్తలే బలం అని, వారి త్యాగాలను మర్చిపోలేమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని తెలిపారు.
By అంజి
'త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ'.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
టీడీపీకి కార్యకర్తలే బలం అని, వారి త్యాగాలను మర్చిపోలేమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేపట్టామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు వస్తాయన్నారు. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కార్యకర్తల ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు పెంచామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని చంద్రబాబు అన్నారు.
2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తానన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతి ఇంటికి తీసుకెళ్లి వివరించాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని, దోషులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
నేరం చేయడం, తప్పించుకోవడానికి ఎదురుదాడి చేయడం అలవాటుగా మారిందన్నారు. ఇలానే వదిలేస్తే అబద్ధాలను పదే పదే చెప్పి ప్రజలను మోసం చేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పులు సరిదిద్దుతూ.. వ్యవస్థలను చక్కబెడుతున్నామని తెలిపారు. ప్రజల సెంటిమెంట్‌తోనూ ఆడుకునే స్థాయికి వైసీపీ దిగజారిందన్నారు. అధికారం చేపట్టగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెట్టామన్నారు. తిరుమలలో గోవింద నామ స్మరణ మాత్రమే వినపడాలని, ఏ ఇతర నినాదాలు వినపడకూడదని అన్నారు.