నెల్లూరులో విషాదం..ఇంట్లో తండ్రి మృతదేహం, ఇంటర్ పరీక్షకు కొడుకు

నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 3:07 PM IST

Andrapradesh, Nellore, Inter Exams, Heart breaking, Student Life, Father Loss

నెల్లూరులో విషాదం..ఇంట్లో తండ్రి మృతదేహం, ఇంటర్ పరీక్షకు కొడుకు

నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. సంగం మండలానికి చెందిన కందం రాంసాయి అనే ఇంటర్ విద్యార్థి తండ్రి ఆదివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగానే, ఆ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని రాంసాయి సోమవారం ఇంటర్ పరీక్షకు హాజరయ్యాడు. బంధువులు, లెక్చరర్లు ధైర్యం చెప్పడంతో భవిష్యత్తు కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. పరీక్ష పూర్తయిన తర్వాత తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మరణించిన బాధలోనూ విద్యార్థి పరీక్షకు వెళ్లడం చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

Next Story