క‌రోనా మ‌హ‌మ్మారి.. సంవ‌త్స‌రానికి పైగా కంటి మీద కునుకు లేకుండా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంది. ఎన్నో కుటుంబాలలో చీక‌ట్లు నింపింది. తాజాగా క‌రోనా సోకిందన్న భయంతో ఏపీలో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. వివ‌రాళ్లోకెళితే.. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లిదండ్రులతోపాటు కుమారుడు, కోడలుకు నాలుగురోజుల క్రితం కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ కుటుంబికులు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబం మొత్తం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


సామ్రాట్

Next Story