ఆనందయ్యను అరెస్టు చేయలేదు.. ఆ వార్తలు నమ్మకండి

Fake News On Anandaiah Arrest. కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బొణిగి ఆనందయ్య గురించి ఇప్పుడు

By Medi Samrat  Published on  22 May 2021 5:48 AM GMT
ఆనందయ్యను అరెస్టు చేయలేదు.. ఆ వార్తలు నమ్మకండి

కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బొణిగి ఆనందయ్య గురించి ఇప్పుడు దేశం మొత్తం చర్చిస్తోంది. ఆయన ఇచ్చిన మందులు తీసుకుని తమకు కరోనా నయమైందని పలువురు చెప్పడంతో నెల్లూరు జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా అక్కడికి చేరుకొని.. క్యూ లైన్లలో నిలబడ్డారు. అయితే కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బొణిగి ఆనందయ్యను అరెస్టు చేశారనే వార్త వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని నెల్లూరు పోలీసు విభాగం తెలిపింది. నెల్లూరు పోలీసు విభాగం ఓ ప్రకటన ఇస్తూ.. ఆనందయ్యను అరెస్టు చేశామనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. నమ్మకండని చెప్పారు. ఆయనకు ఉన్న పాపులారిటీ కారణంగా సెక్యూరిటీని కూడా కల్పించామని నెల్లూరు పోలీసులు తెలిపారు.

సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఆనందయ్యను అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బొణిగి ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవంమని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇవి కేవలం వదంతులు మాత్రమేనని చెప్పుకొచ్చారు. దయచేసి ఎవ్వరూ ఇటువంటి పుకార్లను నమ్మవద్దని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఆనందయ్య ఔషధం తయారీలో ఉపయోగించే చెట్ల ఆకులు, పదార్థాలను ఐసీఎంఆర్ బృందంలోని సభ్యులు పరిశీలించారు. ఔషధ తయారీ విధానాన్ని ఆనందయ్యను అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందుతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే కోణంలో ఆరా తీశారు. ఐసీఎంఆర్ బృందం వెంట నెల్లూరు జేసీ హరేంద్రప్రసాద్, డీపీవో ధనలక్ష్మి కూడా ఉన్నారు.


Next Story