తెలుగు రాష్ట్రాల్లో వణుకుతున్న జనం.. దట్టంగా కురుస్తున్న మంచు

Extreme cold intensity in Telugu states. ఏపీ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేకపోతున్నారు.

By అంజి  Published on  31 Jan 2022 8:50 AM IST
తెలుగు రాష్ట్రాల్లో వణుకుతున్న జనం.. దట్టంగా కురుస్తున్న మంచు

ఏపీ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో మంచు పొగ దట్టంగా కమ్ముకుంటోంది. ఉదయం 9 గంటలు అవుతున్నా భానుడి జాడ కనిపించడం లేదు. జనానికి చలిపులి వణుకు పుట్టిస్తోంది. మధ్య భారత్‌ మీదుగా పొడిగాలులు వీస్తున్నాయి. దీని కారణంగానే కోస్తాలో చలి తీవ్రత బాగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న మధ్య కోస్తా శివారు, ఒడిశాకు ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయి కన్నా తక్కువగా 3 నుంచి 5 డిగ్రీలు నమోదవుతున్నాయి.

చింతపల్లిలో సాధారణం కన్నా అత్యంత కనిష్టంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ శీతాకాలంలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని వెదర్‌ అధికారులు చెప్పారు. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో చలిపులి వణికిస్తోంది. రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుండి బలంగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మరో రెండు రోజుల పాటు ఇదే వెదర్‌ ఉంటుందని అధికారులు అంటున్నారు. ఆదివారం రాష్ట్రంలో పలు తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

Next Story