మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దివంగత సీఎం, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చుట్టూ జరిగిన కుట్రలు, కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయారని అన్నారు. రాజకీయాల్లో ఆయన భోళా మనిషి అని.. అందుకే ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురయ్యారని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన ఎంతో పాటుపడ్డాడని, పేద ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ తీసుకువచ్చారని కొనియాడారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఎన్టీఆర్ సైలెంట్ విప్లవాన్ని తీసుకువచ్చారని అన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఎన్జీఆర్ శత జయంతి ఉత్సవాలకు శనివారం వెంకయ్య నాయుడు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రత్యేక అథితులుగా ఎన్జీఆర్ కుమార్తె లోకేశ్వరి, కుమారుడు రామకృష్ణ హాజరయ్యారు.