తిట్టినట్టు నిరూపిస్తే.. ఇంటికెళ్లి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం : కేతిరెడ్డి పెద్దారెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాను ఏనాడూ దూషించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు.

By Medi Samrat
Published on : 25 July 2025 7:52 PM IST

తిట్టినట్టు నిరూపిస్తే.. ఇంటికెళ్లి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం : కేతిరెడ్డి పెద్దారెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాను ఏనాడూ దూషించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలు అబద్దపు ప్రచారమేనని, జేసీ భార్య ఉమ అక్కను తాను ఎక్కడైనా తిట్టినట్టు, దూషించినట్టు నిరూపిస్తే, తాను స్వయంగా జేసీ ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. వైసీపీ తాడిపత్రి సమావేశంలో తన కోడలు పాల్గొనడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేతిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఉందని తెలిపారు.

జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఉన్న కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగం కాదని, అవన్నీ చట్టబద్ధమైన కేసులేనని కేతిరెడ్డి స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిషేదించిన BS-3 వాహనాలను స్క్రాప్‌గా కొనుగోలు చేసి జేసీ ట్రావెల్స్‌లో తిప్పారని, ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. జేసీ కుటుంబంపై కేసులు ఎవరు పెట్టారు? ఏ విచారణ సంస్థ పెట్టిందో ఓసారి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లిస్ట్ తెప్పించుకొని చూసుకోవాలన్నారు.

Next Story