జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు : మాజీమంత్రి సోమిరెడ్డి

ప్రపంచమంతా డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తాపత్రయపడుతుంటే.. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేస్తున్నార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  23 March 2024 1:30 PM GMT
జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు : మాజీమంత్రి సోమిరెడ్డి

ప్రపంచమంతా డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తాపత్రయపడుతుంటే.. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేస్తున్నార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అనధికారిక డ్రగ్ సరఫరాలో ప్రపంచాన్ని నాశనం చేస్తున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటన్నారు. అలాంటి దేశాధ్యక్షునితో విజయసాయిరెడ్డికి ఏం పని.? అని ప్ర‌శ్నించారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నికైనపుడు శుభాకాంక్షలు తెలిపి.. ఇప్పుడు అదే దేశం నుండి 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ వచ్చిందంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది. అదే సమయంలో సీబీఐ అధికారుల‌ని రాష్ట్ర పోలీసులు నిలువరించడం వెనుక ముఖ్యమంత్రి హస్తం తప్పకుండా ఉందని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ డ్రగ్ వ్యహారం మొత్తం వెనుక జగన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

నెల్లూరు జిల్లా వాసినని చెప్పుకునే విజయసాయిరెడ్డి 2016 నుండి ఎంపీగా ఉండి జిల్లాకు ఏం చేశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో పుట్టిన నులిపురుగు విజయసాయి రెడ్డి అని ధ్వ‌జ‌మెత్తారు. వేల కోట్ల ప్రజల సొమ్ము దిగమింగి 16 నెలలు చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. నెల్లూరులో ఒక్క సీటు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. మంత్రి రోజా ఇప్పటి వరకూ తన శాఖకు సంబంధించి ఒక్కసారి కూడా రివ్యూ పెట్టింది లేదు. శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలియదు. కానీ, నోరేసుకుని పడిపోవడంలో మాత్రం ముందున్నారని విమ‌ర్శించారు. జగన్ రెడ్డి హీరో కాదు.. జీరో అని.. మరో 40 రోజుల్లో ప్రజలు నిరూపించబోతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఓటు అడిగే కనీస హక్కు కూడా లేదన్నారు. కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ తో సమాజాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సన్నాసుల్ని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు ప్రజలంతా ఫిక్స్ అయిపోయారని సోమిరెడ్డి అన్నారు.

Next Story