మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు, అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయినా ఇంకా చర్యలు కనిపించడం లేదన్నారు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో, ఎస్పీ కారకులైన అందరిపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అసలైన నిందితులపై చర్యలు తీసుకోకపోగా, ఇంకా కాపాడాలనే చూస్తున్నారన్నారు.
సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. మరి గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు చనిపోతే.. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు. అల్లు అర్జున్‌కు ఉన్న మానవత్వం కూడా మీకు లేదా అని ప్రశ్నించారు రోజా.