జగన్ బిజినెస్ మెన్‌గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మెన్‌గా సక్సెస్ అయిన వ్యక్తి : రోజా

మాజీ మంత్రి రోజా కూట‌మి ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

By Medi Samrat  Published on  26 Dec 2024 7:13 PM IST
జగన్ బిజినెస్ మెన్‌గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మెన్‌గా సక్సెస్ అయిన వ్యక్తి : రోజా

మాజీ మంత్రి రోజా కూట‌మి ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ.. జైల్లో పెడతావా.. కేసులు పెడతావా.. పెట్టుకో.. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్.. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది వడ్డీతో సహా తిరిగి ఇస్తామ‌న్నారు. ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్ బుక్ లో రాసి పెట్టుకుంటాం.. వారిని గుర్తుపెట్టుకుంటామ‌న్నారు. ఉద్యోగస్తులందరూ ఎగిరెగిరి పడ్డారు.. మన ప్రభుత్వాన్ని దించేంతవరకూ ఉద్యోగులందరూ కంకణం కట్టుకొని పనిచేశారు.. ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబుకు, లోకేష్ కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఏపీ యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు.

మనం తప్పులు చేసి ఓడిపోలేదు‌.. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఆలీబాబా ఆరడజను దోంగల్లా మారిందన్నారు. ఏపీ ప్రజలకు నరకం అంటే ఏంటో కూటమీ ప్రభుత్వం చూపిస్తుందన్నారు. జగన్ ను ఓడించి తప్పుచేశామని ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు‌.. పశ్చాత్తాప పడుతున్నారన్నారు. సంపద సృష్టిస్తా అని చెప్పిచంద్రబాబు అప్పుల మీద అప్పులు సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో పచ్చ చొక్కాలు వేసుకుని, పచ్చ చీరలు కట్టుకుని నీకు 15వేలు, నీకు 15వేలు అంటూ అబద్దాలు చెప్పారన్నారు. జగన్ బిజినెస్ మాన్ గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మెన్ గా సక్సెస్ అయిన వ్యక్తి అని కొనియాడారు.

Next Story