మాజీ మంత్రి ప్రత్తిపాటికి త‌ప్పిన ప్ర‌మాదం

Ex Minister Prathipati Pullarao Car Accident. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.

By Medi Samrat  Published on  7 Feb 2021 7:00 AM GMT
Ex Minister Prathipati Pullarao Car Accident

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం నరసరావుపేట- చిలకలూరిపేట మార్గంలో వెళ్తుండగా పుల్లారావు కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పుల్లారావు కారు స్వల్పంగా దెబ్బతిన్న‌ది. దీంతో ప్రమాదం నుంచి మాజీ మంత్రి క్షేమంగా బయటపడ్డారు.

హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పత్తిపాటి అభిమానులు, నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story