బాబాయి హంతకులు జైలుకు వెళ్లాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ముఖ్యమంత్రి నీకు బాధ్యత లేదా.? నాలుగేళ్లు దొంగలను ఎందుకు కాపాడావు అని ప్రశ్నించారు. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని.. రూ.40 కోట్లు సుపారి అని ఆరోపించారు. నిన్న భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు..! ఇవాళ అవినాష్ రెడ్డి .!! అసలు దొంగలు ఎవరు..? అని ప్రశ్నించారు. తాడేపల్లి కొంప వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి.. బయటికి రావాలి దొంగలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి తమ్ముడు పెద్ద రాజభవనంలో ముందు రోజు కుక్కని చంపారు. తర్వాత రోజు గొడ్డలితో ఆయన్ను చంపారు. తర్వాత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు చంపారని నింద మాపై వేశారన్నారు.
కోడి కత్తి డ్రామా బయటపడింది. అతను నాలుగేళ్ల నుంచి జైల్లో ఉన్నాడన్నారు. గడ్డి మందు పాపాలు, పంచాయతీలు బయటపడాలన్నారు. ధైర్యంగా ఎదురు తిరిగి నేను పోరాటం చేస్తే.. దొంగలంతా చేరి నన్ను బొంద పెట్టారు. నాకు వెన్నుపోటు పొడిచి పారిపోయారు. ఈరోజు అందరూ పేదవాళ్లే నా పక్కన మిగిలారన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు చేశారు. ఈ ప్రాంతంలో పూరగుట్ట ఎవరికైనా తెలుసా? దేవినేని ఉమా దాన్ని బయటకు తీసి పేదలకు ఇచ్చాడు కాబట్టే నన్ను బొంద పెట్టారని పేర్కొన్నారు. కొండపల్లి అడవిని కొట్టారని నేను చెబితే.. నా కారు అద్దాలు పగలగొట్టి నాపై ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టారని అన్నారు.